Header Banner

మంత్రి లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పెట్టుబడి! 2 వేల ఉద్యోగాలు సిద్ధం!

  Thu May 08, 2025 16:46        Politics

మంత్రి లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. గురువారం నాడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేశారు. దీంతో నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.


తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఇవాళ(గురువారం) పర్యటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే పనిలో లోకేష్ బిజీగా ఉన్నారు. లోకేష్ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి మరో మెగా పెట్టుబడి వచ్చింది. సత్యవేడు నియోజక వర్గం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు ఈరోజు(మే8)న భూమి పూజ చేశారు. రూ. 839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేయడంతో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్రంలో మరో అడుగు పడింది. రూ. 5,001 కోట్ల పెట్టుబడిలో భాగంగా 2 వేల ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ఆర్థిక చరిత్రలో ఎల్జీ సంస్థ ఏర్పాటు చరిత్రలలో నిలిచిపోయే అంశమని తెలిపారు. ఎల్జీ తమ సంస్థలు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఎల్జీ సిటీ ఏర్పడనుందని అన్నారు. విదేశీ సంస్థల ప్రతినిధుల రాకపోకలకు రాబోయే నాలుగు సంవత్సరాల్లో తిరుపతికి అంతర్జాతీయ విమానయానం పెరిగేలా చేస్తామని చెప్పారు. పరిశ్రమలు తీసుకు రావటానికి మంత్రులు, కలెక్టర్లు మాత్రమే కాదని..ప్రతి నియోజక వర్గం మరో నియోజక వర్గంతో పోటీ పడాలని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఎల్జీ సంస్థ రూ.5000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు పెట్టే నమ్మకాన్ని తెచ్చిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


కాగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్న నేపథ్యంలో ముందస్తు అనుమతితో ఇవాళ కేబినెట్‌కు రావడం లేదని సమాచారం ఇచ్చారు. రేపు(శుక్రవారం) సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇవాళ కేబినెట్‌ సమావేశానికి మరో మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కాలేదు. విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా కేబినెట్ భేటీకి మరో మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరుకాలేదు. ఈ మేరకు మంత్రులు ముందస్తు అనుమతి పొందారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #LGElectronics #APInvestments #SriCity